పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన పూనమ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఈమె సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పడంతో పెద్ద ఎత్తున వివాదాలలో నిలుస్తూ భారీ ట్రోల్లింగ్స్ ఎదుర్కొంటూ ఉంటారు.
ఇలా తరచూ ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో నిలిచే ఈమె తాజాగా తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజుభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో నటి పూనమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం తనని మతం పేరిట, కులం పేరిట చూసి తనని వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను కూడా తెలంగాణలోనే పుట్టి పెరిగానని తాను కూడా తెలంగాణ ఆడబిడ్డనేనని తెలిపారు. తెలంగాణలో పుట్టి పెరిగిన నన్ను మతం పేరిట కులం పేరిట వేరు చేస్తూ తనని పంజాబీ అని, సిక్కు అనే పేర్లతో వేరు చేస్తున్నారని, దయచేసి తనను అలా వేరు చేయొద్దని, తాను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ ఈ సందర్భంగా ఈమె వేదికపై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.