Poonam Kaur: పేర్లు చెప్పకుండా షాకింగ్ ట్వీట్లు చేసిన పూనమ్ కౌర్!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా పలు వివాదాల ద్వారా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన మాయాజాలం అనే సినిమాతో పూనమ్ కౌర్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో హీరోయిన్ చెల్లెలి పాత్రల్లో, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ లో కూడా పూనమ్ కౌర్ నటించారు. స్టార్ హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నా కెరీర్ లో ఆశించిన స్థాయిలో పూనమ్ సక్సెస్ కాలేదు.

Click Here To Watch

అయితే పూనమ్ కౌర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లలో కొన్ని ట్వీట్లను పూనమ్ కౌర్ డిలీట్ చేయడం గమనార్హం. పూనమ్ కౌర్ మొదట రాజకీయాలు వినోదంగా మారిపోయాయని వినోదం అనేది రాజకీయంగా మారిపోయిందని పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్ ను కొంత సమయానికే పూనమ్ డిలీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో తాను మనస్పూర్తిగా లవ్ చేసిన వ్యక్తులు రాజకీయ నాయకుల ముందు చేతులు కట్టుకోవడం, చేతులు జోడించడం తనకు నచ్చలేదని పూనమ్ వెల్లడించారు.

నాకు చాలా బాధ వేస్తోందని ట్వీట్ చేసిన పూనమ్ ఆ ట్వీట్ ను కూడా డిలీట్ చేశారు. ఆ తర్వాత పూనమ్ వర్మ ట్వీట్ కు బదులిస్తూ ఒక డైరెక్టర్ అతని వ్యక్తిగత జీవితంపై దారుణంగా మాట్లాడి ఒక పక్కన నిలబడి నవ్వుతున్నాడని మరో డైరెక్టర్ రాజకీయంగా అతడిని దిగజార్చి ట్విట్టర్ లో నవ్వుతున్నాడని ఆమె అన్నారు. ఇద్దరు డైరెక్టర్లు అమ్మాయిని ఆయుధంగా పెట్టుకుని డబ్బుకు అద్దెకు తీసుకున్న ఏజెంట్లు అని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఏపీలో గత ఎన్నికల్లో జరిగిన బిగ్గెస్ట్ క్రైమ్ ఏమిటని పూనమ్ ప్రశ్నించారు. పెళ్లిళ్లపై మనం నిజంగా దృష్టి కేంద్రీకరించింది ఏమిటని ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లలో పూనమ్ కౌర్ పేర్లు ప్రస్తావించకపోవడంతో పూనమ్ కామెంట్లను బట్టి ఆమె ఎవరి గురించి కామెంట్లు చేసిందో తమకు తెలుసని నెటిజన్లు చెబుతున్నారు. పూనమ్ అకస్మాత్తుగా ఇలా ట్వీట్లు చేయడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus