సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అవడం.. వేలు, లక్షల కొద్దీ లైక్స్ రావడం కామనే.. అది వారి ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయం కావచ్చు.. పర్సనల్ మేటర్ కావచ్చు.. అయితే సొసైటీలోని ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఇష్యూ జరుగుతున్నప్పుడు పరిస్థితిని బట్టి.. జరిగిన తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడించేటప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి.. లేదంటే తిప్పలు తప్పవు.. సెలబ్రిటీలు కదా ఈజీగా ట్రోలింగ్‌కి గురవుతుంటారు..
ఇప్పుడలానే నెటిజన్ల ఆగ్రహానికి గురైంది నటి పూనమ్ కౌర్.. పూనమ్ కౌర్ తెలుగులో కనిపించి చాలా సంవత్సరాలవుతోంది.. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల నుండి దాదాపుగా ఫేడౌట్ అయిపోయినట్టే.. పర్సనల్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానంటూ కొద్ది కాలం క్రితం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.. తర్వాత అడపాదడపా సోషల్ మీడియాలోనే తప్ప బయట పెద్దగా కనిపించట్లేదు.. ఇదిలా ఉంటే తాజాగా పూనమ్.. ప్రీతి చనిపోయినట్లు ఓ ట్వీట్ చేసింది..
వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. శనివారం (ఫిబ్రవరి 25) ఉదయం నిమ్స్ వైద్యులు ఆమె హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆమెను బతికించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు.. ప్రీతి అంశంపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది..
ఇంతకీ పూనమ్ ఏమని ట్వీట్ చేసిందంటే.. ‘‘మనుగడ , పరువు, న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది.. వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది.. మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు.. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు, లేదా న్యాయం పొందదు’’.. అని రాసుకొచ్చింది.. దీంతో, ఈ ట్వీట్ చదవిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ప్రస్తుతం ప్రీతి కండిషన్ క్రిటికల్ అనేది వాస్తవం.. కానీ, పూనమ్ మాత్రం.. ప్రీతి చనిపోయినట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్స్ తనపై ఫైర్ అవుతున్నారు..
మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు.#warangal#docsaif