Poorna: 2వ సారి తల్లి కాబోతున్న పూర్ణ.. బేబీ బంప్ ఫోటోలతో క్లారిటీ
- January 21, 2026 / 04:48 PM ISTByPhani Kumar
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ పూర్ణ(Poorna) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలతో, ఇటు టీవీ షోలతో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌కి ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే తాను రెండోసారి అమ్మను కాబోతున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసింది.ఇప్పటికే ఒక బాబుకు తల్లి అయిన పూర్ణ.. మరికొద్ది రోజుల్లో మరోసారి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించడానికి సిద్ధమైంది.
Poorna(Shamna Kasim)
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ వదిలింది. పసుపు రంగు పట్టుచీరలో, నిండు గర్భిణిగా బేబీ బంప్‌తో పూర్ణ ఇస్తున్న ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె మొహంలో ప్రెగ్నెన్సీ గ్లో క్లియర్‌గా కనిపిస్తోంది.దుబాయ్ బిజినెస్‌మెన్ షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లాడిన పూర్ణ.. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు.

ఇప్పుడు తమ చిన్నారి కుటుంబంలోకి మరో కొత్త మెంబర్ రాబోతుండటంతో పూర్ణ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కామెంట్స్ సెక్షన్‌లో పూర్ణకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ కురిపిస్తున్నారు.‘సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించిన పూర్ణ.. బుల్లితెరపై డాన్స్ షోలకు జడ్జిగానూ ఆడియెన్స్‌కు దగ్గరైంది.
‘గుంటూరు కారం’లో ఈమె చేసిన ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ 2 తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. అలాగే ‘అఖండ 2’ లో కూడా ముఖ్య పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్













