సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ నుండి మలయాళం ఇండస్ట్రీ వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 2023 ఏడాదిలో 3 నెలలు గడవక ముందే కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారకరత్న, మలయాళం యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్, హాలీవుడ్ నటుడు ‘జాన్ విక్’ నటుడు లాన్స్ రెడ్డిక్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కొన్ని గంటల క్రితం ‘హ్యారీ పోటర్’ ఫేమ్ పాల్ గ్రాంట్ కూడా మరణించారు. ఈ విషాదకరమైన వార్త విని 24 గంటలు కాకుండానే మరో నటుడు మరణించడం ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే… ప్రముఖ నటుడు, పబ్లిసిటీ ఇంచార్జ్ అయిన ప్రమోద్ కుమార్ ఈరోజు అనగా మార్చ్ 21న విజయవాడ లో పరమపదించారు. ఆయన వయస్సు 87 ఏళ్ళు. 38 సంవత్సరాల నుండి సినీ పరిశ్రమలో ఉన్నారు. 300 చిత్రాలకు పబ్లిసిటీ ఇంచార్జ్ గా పని చేశారు.
వాటిలో శతదినోత్సవ చిత్రాలు 31 ఉండటం విశేషం. అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగా నటించారు. రెండు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారాయన. ‘సుబ్బయ్య గారి మేడ’ చారిత్రక నవలగా రాశారు. తన సినీ అనుభవాలను ‘తెర వెనుక తెలుగు సినిమా’ పేరుతో గ్రంథస్తం చేశారు. ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారమైన ‘నంది’ పురస్కారానికి ఎన్నికైంది. ఇక ఈయన మరణవార్తతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?