పోసాని ఏంటి మహేష్ ని పాలిటిక్స్ లోకి లాగుతున్నాడు!
- May 25, 2020 / 04:42 PM ISTByFilmy Focus
నటుడు రచయిత పోసాని కృష్ణమురళి పరిశ్రమలో ముక్కుసూటిగా మాట్లేడే మనిషి. మాటలో కటువు, విలక్షణతతో పాటు సెపెరేట్ మేనరిజం ఆయన సొంతం. మీడియా వేదికగా అప్పుడప్పుడు కొన్ని సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ ఉంటాయి. కాగా తాజాగా ఆయన మహేష్ మరియు సీఎం జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పోసాని వ్యాఖ్యలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ విషయంలోకి వెళితే జగన్ ఏపీ సీఎంగా గెలిచి ఏడాది పూర్తి అయ్యింది.
ఈ సందర్భంగా జగన్ సన్నిహితుడిగా ఉన్న పోసాని కృష్ణ మురళి ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో 2019 ఎన్నికల అనంతరం జగన్ విజయంపై మహేష్ పోసానిని అడిగి ఆరా తీశారట. జగన్ గెలుపు ఎంత వరకు సాధ్యం అనే విషయాన్ని మహేష్ పోసానిని అడిగి తెలుసుకున్నారట. పోసాని ఖచ్చితంగా జగన్ గెలవబోతున్నారని మహేష్ కి చెప్పారట. ఐతే మహేష్ ఎప్పుడు కూడా రాజకీయ విషయాలపై స్పందించింది లేదు. పాలిటిక్స్ లో తనకు నాలెడ్జ్ లేదని మహేష్ చాల సార్లు బహిర్గతంగానే చెప్పారు.

ఈ నేపథ్యంలో మహేష్ ఓ పార్టీకి, వ్యక్తికి ఫేవర్ అనట్లున్న కృష్ణ మురళి వ్యాఖ్యలు ఇప్పుడు అవసరమా అనే ఆలోచన కలిగిస్తుంది. ఒకవేళ మహేష్ వ్యక్తిగతంగా ఈ విషయంపై ఆరా తీసినా, అది పోసాని బహిరంగంగా బయటపెట్టాల్సిన అవసరం ఏముంది. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియని మహేష్ కి రాజకీయ రంగు పులిమినట్లు పోసాని వ్యాఖ్యలు ఉన్నాయి.
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
















