తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నందమూరి వారసుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పోలికలతో ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నటుడుగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈయన రాజకీయాలలోకి వస్తే సక్సెస్ అవుతారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేతలు కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.ఇటీవల నారా లోకేష్ సైతం ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గాబాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి తాజాగా ఒక మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఉన్నప్పుడు తన భార్య అనారోగ్యంతో మరణించారు. ఆ సమయంలో ఆయనకు అండగా ఉండడం కోసం ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. అలాంటి ఒక మహిళను పట్టుకొని చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.అదే లక్ష్మి పార్వతిని తిట్టే వాళ్ళకి హరికృష్ణ రెండవ భార్య ఎన్టీఆర్ తల్లి గారిని తిట్టే ధైర్యం ఉందా.
లేదు అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకోడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనతో చంద్రబాబు నాయుడుకు చాలా అవసరం ఉంది. తర్వాత ఏపీకి సీఎం అయ్యే కెపాసిటీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ కి మాత్రమే ఉందంటూ ఈ సందర్భంగా పోసాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.