పోసాని కృష్ణ మురళి పరిచయం అవసరం లేని పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఎంతో అద్భుతమైన నటుడిగా కొనసాగిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే తనకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదటి అవకాశాలు కల్పించిన విషయాల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా పోసాని (Posani) మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 37 సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు తాను ఏ చిన్న తప్పు కూడా చేయలేదని తెలిపారు. ఇక ఇండస్ట్రీలో తనకు మొదటగా పరుచూరి బ్రదర్స్ అవకాశం కల్పించారని ఈయన గుర్తు చేసుకున్నారు.తాను అవకాశాల కోసం ముందు పరచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్తే తమ దగ్గర ఏమీ లేవని చెప్పి పంపించారు. అయితే నేను అక్కడి గేటు వద్ద నిలబడి ఉండగా పరుచూరి గోపాలకృష్ణ గారు రేపు ఉదయం 5:30 గంటలకు వచ్చి కలవమని చెప్పారు.
ఇలా వారు చెప్పిన సమయాని కన్నా ముందుగానే అక్కడికి వెళ్లానని తెలిపారు.నన్ను చూసిన పరుచూరి బ్రదర్స్ బాగా చదువుకున్న వ్యక్తిలా ఉన్నావు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని సలహాలు కూడా ఇచ్చారు.ఇక పేకాట పిచ్చోడు అనే పాత్రకు కొన్ని డైలాగ్స్ రాయమని పరుచూరి వెంకటేశ్వరరావు తనకు చెప్పారు. నేను దాదాపు 70 డైలాగ్స్ రాశాను అందులో 50 డైలాగ్స్ కు టిక్ పెట్టి 35 డైలాగులను సినిమాలో వాడుకున్నారని అలాగే బాగా డైలాగ్స్ రాసావ్ అంటూ పరుచూరి వెంకటేశ్వరరావు తనను మెచ్చుకున్నారని తెలిపారు.
ఇక ఈ సినిమా విడుదలయ్యి మంచి సక్సెస్ అయ్యే వరకు తనకు సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదని పోసాని ఈ సందర్భంగా తెలియజేశారు. నటుడిగా రచయితగా ఈయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఈయన నిర్మాతగా ఉన్న సమయంలో భోజనాల కోసమే అప్పట్లో సుమారు 30 లక్షల వరకు ఖర్చు చేశానని, ఇండస్ట్రీలో నేను పెట్టినంత మంచి భోజనం ఎవరు పెట్టలేదంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.