Sita Ramam Movie: దర్శకుడు హను నమ్మకం నిజమయ్యేలా ఉందిగా..!

దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’ చిత్రం రోజు రోజుకీ అంచనాలు పెంచుతుందని చెప్పాలి. ప్రేమ కథా చిత్రాలకు స్పెషలిస్ట్ అయిన హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సినిమాని భారీ బడ్జెట్ తో అశ్వ‌నీద‌త్, స్వప్న దత్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆగ‌స్టు 5న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను మూటకట్టుకుంటున్నాయి.

మరీ ముఖ్యంగా క్లాస్ సినిమాలు అంటే ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ అదేంటో… ‘సీతా రామం’ చిత్రం పై మాత్రం ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి పెరిగింది. వాటికి అదనంగా ‘ఇంతందం’ ‘ఓ సీత హే రామ’ వంటి పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ప్రేమ కథా చిత్రాలకు కావాల్సిన సూపర్ హిట్ మ్యూజిక్ ను విశాల్ చంద్ర శేఖర్ అందించినట్టు ఈ పాటలు చాటి చెప్పాయి.

దర్శకుడు హను రాఘవపూడి చిత్రాలకు రిజల్ట్ తో సంబంధం లేకుండా విడుదలకి మంచి హైప్ ఏర్పడుతుంటుంది. ‘ఓ దర్శకుడి పై గౌరవం ఏర్పడింది అంటే అది ఓ సినిమాతో ఆగిపోదు’ అని ఆయన ఈ చిత్రం ప్రమోషన్లలో ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఆయన నమ్మకం నిజమయ్యేలా ‘సీతా రామం’ ప్రచార చిత్రాలు ఉన్నాయి. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మంచి సంభాషణలు, భావోద్వేగాలు, పేరున్న నటీనటులు ఈ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ టైంలో టాలీవుడ్ కి అవసరమైన హిట్ ని ‘సీతా రామం’ అందించే విధంగా కనిపిస్తుంది. నటీనటులు.. సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో శ్రద్ధతో ఈ దృశ్య కావ్యాన్ని తీర్చిదిద్దారు అనే ఫీలింగ్ కు కూడా కలిగిస్తుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus