శ్రీను వైట్ల (Srinu Vaitla) .. గతంలో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు. అతని సినిమాలు అంటే మినిమమ్ గ్యారంటీ అనే విధంగా ఉండేవి. శ్రీను వైట్ల సినిమాలు థియేట్రికల్ పెర్ఫార్మన్స్ తో సంబంధం లేకుండా.. మంచి బిజినెస్ చేసేవి. ఎందుకంటే ఆయన మార్క్ కామెడీ అలా ఉండేది. ‘కింగ్’ ‘అందరివాడు’ ‘నమో వెంకటేశ’ వంటి సినిమాలు హిట్లు కాకపోయినా.. అవి టీవీల్లో, యూట్యూబ్లో చూడటానికి బాగానే ఉంటాయి. అయితే ‘ఆగడు’ నుండి శ్రీను వైట్ల వెనుకబడ్డాడు.
Viswam
ఆ తర్వాత వచ్చిన ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ సినిమాలు ఆయన ఫేడౌట్ స్టేజికి దగ్గరయ్యారేమో అనే అనుమానం కలిగించింది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అయితే శ్రీను వైట్ల గౌరవంగా రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే తన ఉనికిని చాటుకోవడానికి గోపీచంద్ రూపంలో శ్రీను వైట్లకి ఓ సువర్ణావకాశం దొరికినట్టు అయ్యింది. వాస్తవానికి గోపీచంద్ కూడా ప్లాపుల్లోనే ఉన్నాడు. కానీ అతనికి మాస్ ఇమేజ్ ఉంది. సరైన సినిమా పడితే మాస్ ఆడియన్స్ అతని సినిమాలని ఆదరిస్తారు. శ్రీను వైట్లకి ఉన్న ఏకైక హోప్ అదే.
అందుకే గోపీచంద్ తో ‘విశ్వం’ (Viswam) చేశాడు శ్రీను వైట్ల. ఈ సినిమా టీజర్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ మాత్రం ఇంప్రెస్ చేయలేదు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పర్వాలేదు అనిపించుకునే టాక్ ను రాబట్టుకుంది. ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అయ్యింది. కామెడీ కొన్ని చోట్ల పేలింది. సెకండాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ రేంజ్లో లేదు. మొత్తంగా ‘విశ్వం’ (Viswam) యావరేజ్ సినిమా అని ప్రేక్షకులు అంటున్నారు.’అలా అని శ్రీను వైట్ల గట్టెక్కినట్టేనా?’ అంటే కచ్చితంగా అవునని చెప్పలేం.
ఎందుకంటే ‘విశ్వం’ విషయంలో శ్రీను వైట్ల కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇందులో కూడా ‘దుబాయ్ శీను’ ‘వెంకీ’ ‘బాద్ షా’ వంటి సినిమాల్లో హైలెట్ అయిన సన్నివేశాలు ఉంటాయి. స్క్రీన్ ప్లేని అటు ఇటు మార్చుకుని తీసిన సినిమానే కానీ.. కొత్తగా శ్రీను వైట్ల డెలివరీ చేసింది ఏమీ లేదు. అయితే దసరా హాలిడేస్ ఉన్నాయి… కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూసుకుంటే ‘విశ్వం’ కి బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకోవడానికి ఓ అడ్వాంటేజ్ ఉంది.