30 ఏళ్ళ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం సంచలనాలు అన్నీ ఇన్నీ. ఏమాత్రం టెక్నాలజీ అభివృద్ధి చెందని రోజుల్లో ఆ చిత్రాన్ని ఎంతో కలర్ ఫుల్ గా ఓ విజువల్ వండర్ గా ..తీర్చిదిద్దారు… దర్శకుడు కె.రాఘవేంద్ర రావు అలాగే నిర్మాత అశ్వినీ దత్ లు. 1990 మే 9న ఈ చిత్రం విడుదయ్యింది. వేసవి కాలం కదా అని సినిమాని విడుదల చేస్తే అప్పుడు భయంకరమైన వర్షాలు కురిశాయట. డిస్ట్రిబ్యూటర్ లు భయంతో వణికి పోయారట. అయినా సరే.. ప్రేక్షకులు ఆ వర్షంలో కూడా తడుస్తూ వచ్చి… కూర్చునే సీట్ల వరకూ నీళ్ళు ఉన్నా .. లెక్క చేయకుండా వచ్చారట.
మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ అప్పట్లో అలా ఉండేదట. అయితే ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పట్లో ప్రభాస్ కే ఉందని అంటున్నారు నిర్మాత అశ్వినీ దత్. ఆయన మాట్లాడుతూ…” ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరువాత మా సంస్థ నుండీ మరో ఫాంటసీ చిత్రం రాబోతోంది. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను సిద్ధం చేశాడు. నాగ్ అశ్విన్ కథ చెబుతున్నప్పుడు, ప్రభాస్ అయితేనే కరెక్ట్ అని నాకు బలంగా అనిపించింది. అప్పట్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కథ వింటున్నప్పుడు .. ఆ కథకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితేనే న్యాయం చెయ్యగలరు అనిపించింది.ఈ కథ విన్నప్పుడు ప్రభాస్ అయితేనే కరెక్ట్ అనిపించింది.
క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా, ఇతర భాషా ప్రేక్షకులకు ఈ కథ చేరువకావడానికిగాను ప్రభాస్ ను తీసుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. ఒక్కసారి కథ వినగానే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని బట్టి కథ ఎంత పెర్ఫెక్ట్ గా వచ్చిందనేది అర్థం చేసుకోండి. మా సంస్థ నుండీ కచ్చితంగా.. ఓ అద్భుతమైన చిత్రం రానుందనే విషయాన్ని ఎంతో నమ్మకంగా చెప్పగలను. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది 2021 ఏప్రిల్లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చారు అశ్వినీ దత్.