రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక మార్చిలో ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. యువి క్రియేషన్స్ లో నిర్మించిన ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా కోసం ఇటీవల కాలంలో యూరప్ కంట్రీస్ లో ఎక్కువగా తిరిగిన ప్రభాస్ అక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడినట్లు గా తెలుస్తుంది.
అంతే కాకుండా ప్రభాస్ అక్కడే ఒక ఖరీదైన విల్లాను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యూరోప్ లోని ఒక మంచి బీచ్ కు దగ్గరగా ఉండే విల్లా పై ప్రభాస్ మనసు పారేసుకున్నాడట. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా ప్రభాస్ తనకు వచ్చిన ఆదాయంలో కొంత డబ్బును విదేశాల్లో పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే యూరోప్లో ఒక మంచి విల్లాను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడట.
ఖరీదైన విల్లా కోసం ఇప్పటికే ప్రభాస్ సన్నిహితులు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఎక్కువకాలం ఇటీవల యూరప్ కంట్రీ లోనే హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక భవిష్యత్తులో కూడా అక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ ఎక్కువగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్లడానికి అంతగా ఇష్టపడేవాడు కాదు. వీలైనంతవరకు ఇండియాలోనే లోకల్ గానే సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకునే విధంగా నిర్మాతలతో దర్శకులతో మాట్లాడుకునేవాడు.
ఇక పాన్ ఇండియా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత విదేశాల్లో మినిమమ్ రెండు పాటల చిత్రీకరణ జరగకపోతే ప్రభాస్ ఒప్పుకోవడం లేదట.. మిగతా సినిమాల మాదిరిగా తన సినిమాలో పాటలు చాలా అందంగా ఉండాలి అని ప్రభాస్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. యూరప్ కంట్రీ లో అయితే ఒక మంచి విల్లాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నాడట.. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.