ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ జమానాలో ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వాడుతున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. చాలా రోజులుగా ఆయన ఎఫ్‌బీలోనే ఎక్కువగా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఎఫ్‌బీ గురించ ఎందుకు అనుకుంటున్నారా? సాధారణంగా ఇటీవల కాలంలో ట్విటర్ గురించి ఎక్కువగా వింటున్న హ్యాక్.. ఆయన ఎఫ్‌బీ పేజీకి అయ్యింది. అందులో హ్యాకర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఆయన టీమ్ అంతలోనే గ్రహించి అకౌంట్‌ను సెట్ చేసుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.
ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతాలో గురువారం సాయంత్రం ఓ వైరల్ వీడియో కనిపించింది. ‘మనుషులు దురదృష్టవంతులు’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో కనిపించింది. ఆ వీడియోను చూసిన అభిమానులు ఏంటి.. ప్రభాస్ ఇలాంటి పోస్ట్ పెట్టాడు అని అనుకున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ‘ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాకయింది’ అంటూ ట్విటర్‌లో స్పందించడం పెట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ టీమ్ ఫేస్‌బుక్ పేజీ సమస్యను పరిష్కరించింది. కాసేపటికి ప్రభాస్ ఎఫ్‌బీ ఖాతాను పునరుద్ధరించారు. దీంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు.
ఇక ప్రభాస్ ఎఫ్‌బీ ఖాతా సంగతి చూస్తే.. అభిమానులకు అందుబాటులో ఉండటం కోసం 10 ఏళ్ల క్రితం ప్రభాస్ ఫేస్‌బుక్‌లోకి వచ్చాడు. అక్టోబర్ 18, 2013న ఖాతా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభాస్‌ను ఎఫ్‌బీలో 24 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాత్రం రాజమౌళి ఒక్కరినే ఫాలో చేస్తున్నాడు. తన చిత్రాల విశేషాలు, ఇతర నటీనటులకు స్పెషల్ డేస్‌లో విషెస్ చెప్పడానికి ఈ ఖాతాను ప్రభాస్ ఉపయోగిస్తున్నాడు.
ఇక డార్లింగ్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ వచ్చే ఏడాదిలో విడుదల చేస్తారు. ఈ సినిమాలు కాకుండా సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!