ఓం రౌత్ పై నెటిజన్ల దారుణమైన ట్రోలింగ్.. ఏం జరిగిందంటే?

ప్రభాస్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈ ఏడాది జూన్ నెల 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటుతుందని భావిస్తున్నారు. అయితే ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ జరగడం లేదు. ప్రభాస్ సైతం ఈ సినిమా గురించి స్పందించడం లేదు. శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా అప్ డేట్ వస్తుందో రాదో స్పష్టత లేదు.

ఓం రౌత్ చేసిన తప్పుల వల్లే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఓం రౌత్ నిద్రలేవాలని ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఓం రౌత్ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తుండగా ఆ ట్రోల్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓం రౌత్ విషయంలో తమకు కోపం ఇంకా తగ్గలేదని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పకనే చెబుతున్నారు.

ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలు బడ్జెట్ విషయంలో, బిజినెస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ మనస్సులను సైతం గెలుచుకుంటున్నారు. ప్రభాస్ కెరీర్ పరంగా ఎదగడంతో పాటు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో ప్రభాస్ కష్టానికి తగ్గ ఫలితం గ్యారంటీగా దక్కుతుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus