Prabhas, Krishnam Raju: రాజు ఎక్కడున్నా రాజే.. బాధలో కూడా ఫ్యాన్స్ గురించి ఆలోచించిన ప్రభాస్!

ప్రభాస్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అభిమానులు ప్రభాస్ ను ఎంతగా ఆదరించి అభిమానిస్తారు. ప్రభాస్ కూడా తన ఫాన్స్ ను అలాగే చూసుకుంటారు అనడానికి ఇదే నిదర్శనం. మామూలుగానే ప్రభాస్ ఇచ్చే ఆధిత్యాన్ని మనం భరించలేమని అంతలా ఆయన అందరిపై ప్రేమను చూపిస్తూ ఉంటారని ఎంతోమంది హీరో హీరోయిన్లు ఈ విషయం గురించి తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఇక కృష్ణంరాజు గారు అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో ఆయనని చివరి చూపు చూడడం కోసం ఎంతో మంది అభిమానులు తరలివచ్చారు.

పెదనాన్న చనిపోయారన్న బాధలో ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం అభిమానుల గురించి ఆలోచించి అక్కడికి వచ్చిన అభిమానులకు పెద్ద ఎత్తున భోజనాలు తయారు చేయించారట. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలలో పాల్గొన్నటువంటి అభిమానులందరికీ ఈయన తప్పకుండా అందరూ భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్ అంటూ చెప్పారని తెలుస్తోంది. ఈ విధంగా పెదనాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ అభిమానుల గురించి ఆలోచిస్తూ వారికి భోజనాలు ఏర్పాటు చేయడంపై అభిమానులు నెటిజన్లు

ప్రభాస్ వ్యవహార శైలి పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు ఎక్కడున్నా రాజే తాను ఎంత బాధలో ఉన్నా తన ప్రజల కోసం రాజు అహర్నిశలు శ్రమిస్తుంటారు. ప్రభాస్ కూడా తాను బాధలో ఉన్నప్పటికీ అభిమానుల ఆకలి గురించి ఆలోచించి భోజనాలు ఏర్పాటు చేయించడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులను భోజనం చేసి వెళ్ళమని చెబుతున్నటువంటి వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రభాస్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus