ప్రభాస్ తో తలపడనున్న ముగ్గురు విలన్లు
- August 19, 2017 / 12:15 PM ISTByFilmy Focus
యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ ఊపందుకుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన 5 కోట్ల భారీ సెట్ లో నిన్న భారీ షెడ్యూల్ మొదలయింది. ఈ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన విలన్ గా నటించనున్నట్లు తెలిసింది. ఈయన గతంలో శక్తి, పంజా తదితర సినిమాల్లో నటించారు. మళ్లీ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే ఆల్రెడీ విలన్స్ గా ఖరారు అయ్యారు.
వారితో పాటు జాకీష్రాఫ్ కూడా చేరడంతో ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా బాలీవుడ్ లో సాహో బిజినెస్ బాగుండాలని హీరోయిన్ ని, విలన్స్ ని అక్కడివారిని తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. శ్రద్ధ కపూర్ తో వీరి ముగ్గురు రామోజీ ఫిలిం సిటీలో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక్కడి భారీ షెడ్యూల్ అనంతరం చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడి ప్రఖ్యాత ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















