శ్యామ్ ప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో ప్రభాస్ స్పెషల్!
- July 29, 2017 / 02:00 PM ISTByFilmy Focus
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిన్న కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి తెలుగు సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలే కాక త్రివిక్రమ్, రాజమౌళి వంటి స్టార్ దర్శకులు కూడా హాజరయ్యారు. ఇంతమంది వచ్చిన ఈ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ప్రభాస్ నిలిచారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఎంత పెరిగిందో ఈ వేడుక స్పష్టం చేసింది. ప్రభాస్ రాగానే అతని చుట్టూ చాలామంది చేరారు. సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.
ప్రభాస్ తో పాటు అందరినీ ఆకర్షించిన మరో వ్యక్తి ఎవరంటే దేవసేన. అదేనండీ అనుష్క. చీరకట్టులో వివాహానికి హాజరైంది. అలాగే బన్నీ, రామ్, సాయి ధరమ్ తేజ్ తదితరుల రాకతో ఈ కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















