Balakrishna,Prabhas: ఒకే ఫ్రేమ్ లో బాలయ్య – ప్రభాస్..!

అల్లు అరవింద్ గారి ‘ఆహా’ కోసం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఇలాంటి షోలకు స్టార్ హీరోలు దూరంగా ఉంటారు. ఎక్కువగా చిన్న లేదా మీడియం రేంజ్ హీరోలు మాత్రమే ఇలాంటి షోలకు హాజరవుతారు. అది ఏ కమెడియన్ లేదా యాంకర్ లేదా హీరోయిన్ హోస్ట్ చేసినప్పుడు. అదే స్టార్ హీరో హోస్ట్ చేస్తున్నాడు అంటే మరో స్టార్ హీరో ఆ షోకి రావడానికి వెనకడుగు వేయలేడు.

ఇప్పుడు అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య స్టార్ హీరోలను రంగంలోకి దింపే పనిలో పడ్డాడు. అందుకే అల్లు అరవింద్ ఏరి కోరి బాలయ్యని పట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొనాలి అని అభిమానులు ఆశపడుతున్నారు. మొన్నామధ్య నిర్మాత నాగ వంశీ ‘అన్ స్టాపబుల్’ షోకి హాజరైతే త్రివిక్రమ్ కు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ను షోకి తీసుకురావాలి అని పరోక్షంగా చెప్పాడు బాలయ్య.

ఇక చిరంజీవి తో ఎపిసోడ్ కూడా ప్లానింగ్ లో ఉంది అని టాక్. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కూడా ఎపిసోడ్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికంటే ముందే.. ప్రభాస్ తో కూడా ఓ ఎపిసోడ్ ఉంటుందని టాక్ నడుస్తుంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలకు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలుసు. కాబట్టి అల్లు అరవింద్ కు ప్రభాస్ ని రప్పించడం అనేది ఈజీ టాస్క్. కాకపోతే ప్రభాస్ కాల్ షీట్లు ఇప్పుడు అస్సలు ఖాళీగా లేవు.

అతను ఏ టైంకి ఎక్కడ ఉంటాడు… అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఒకసారి ‘సలార్’ కోసం కర్ణాటక.. ఇంకోసారి ప్రాజెక్ట్ కె కోసం రామోజీ ఫిలిం సిటీ(హైదరాబాద్), మరోసారి ముంబై ఇలా తిరుగుతూ ఉంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అది ఎలా సాధ్యమవుతుందో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus