హీరో ప్రభాస్ సలార్ సినిమా ద్వారా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరో వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రభాస్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా 21 ఏళ్ల సినీ కెరియర్లో ప్రశాంత్ లాంటి దర్శకుడిని చూడలేదని తెలిపారు.
నేను మొదటి రోజు షూటింగ్లోకి వెళ్లిన రోజే ప్రశాంత్ తో మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలిపారు. ఇక నేను షూటింగ్ లోకేషన్ లోకి అడుగు పెట్టడానికంటే ముందుగానే ప్రశాంత్ అన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారని నేను వెళ్ళగానే నా పైన ఎక్కువ సీన్స్ షూట్ చేస్తారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రశాంత్ నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నారని ప్రభాస్ తెలియజేశారు.
ఇక ఈ సినిమా కోసం వర్క్ షాప్ చేశామని నాకు వచ్చిన ఆలోచనలను తనకు చెప్పడంతో అందులో కొన్ని తీసుకొని కొన్ని సీన్స్ చేశామని ప్రభాస్ తెలిపారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తయిన తర్వాత ప్రశాంత్ నాకు సలహా ఇస్తూ కాస్త కండలు పెంచమని తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే నేను చేశానని ప్రభాస్ తెలిపారు.
అయితే గత 21 సంవత్సరాల కాలంలో నేను ఇతర సినిమాలకు కష్టపడిన దానికంటే పెద్దగా ఈ సినిమాకు ఏం కష్టపడలేదని, సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగిపోయింది అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా సినిమా షూటింగ్ గురించి అలాగే ప్రశాంత్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.