Kalki Movie: కల్కి ఓవర్సీస్ హక్కుల కోసం ఆ రేంజ్ లో పోటీ ఉందా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ కల్కి 2898 ఏడీ ఈ ఏడాది మే నెల 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో సైతం ఈ సినిమా రిలీజయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల ద్వారా 100 కోట్ల రూపాయలు రాబట్టాలని మేకర్స్ భావిస్తున్నారని భోగట్టా. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా అదే మొత్తానికి ఈ సినిమా హక్కులు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

బాహుబలి2 ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డులను అవలీలగా బ్రేక్ చేసే మూవీ కల్కి అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి2 మూవీ ఓవర్సీస్ రికార్డులను బ్రేక్ చేయడం సులువు కాకపోయినా ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే సులువుగా బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కల్కి ప్రమోషన్స్ మొదలైతే ఈ సినిమాపై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరుగుతాయేమో చూడాలి.

నాగ్ అశ్విన్ ఈ సినిమా మొదలైనప్పుడే ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తానని చెప్పారు. కల్కి 2889 ఏడీ ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా ఉంది. ఈ సినిమాకు పోటీ కూడా లేదని తెలుస్తోంది. దేవర కూడా వాయిదా పడటంతో రాబోయే మూడు నెలల్లో భారీ స్థాయిలో విడుదలయ్యే పాన్ ఇండియా సినిమా ఇదేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ లెక్కలు భారీ రేంజ్ లో ఉండటం గమనార్హం.

యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే కల్కి 2898 ఏడీ (Kalki) సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రతి పాత్ర స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ ఏడాది ఈ సినిమాతో పాటు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ కు సంబంధించిన సీన్లను ఇండియాలోనే షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus