Prabhas: స్పిరిట్ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ అలాంటి లుక్ లో కనిపిస్తారా?

ప్రభాస్ (Prabhas) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)   కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్  (Spirit)  సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. స్పిరిట్ సినిమా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ బరువు పెరగనున్నారని పవర్ ఫుల్ లుక్ లో ప్రభాస్ కనిపించనున్నారని సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా.

Prabhas

యానిమల్ (Animal) సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ లుక్ స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ (The Rajasaab) షూట్ పూర్తైన వెంటనే ప్రభాస్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)  సినిమాతో పాటు స్పిరిట్ సినిమాలో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు సైతం బాహుబలి2 (Baahubali 2) , కల్కి (Kalki 2898 AD) సినిమాలను మించి కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సినిమాల విషయంలో వేగం చూపిస్తూ ఫ్యాన్స్ ను, ఇతర హీరోలను ఆశ్చర్యపరుస్తున్నారు. లుక్స్ విషయంలో సైతం ప్రభాస్ వేరియేషన్ చూపిస్తున్నారు. ప్రభాస్ జక్కన్న (S. S. Rajamouli) కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ కాంబోలో మరో సినిమా రావడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ప్రభాస్, రాజమౌళి ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈ కాంబోలో ఇప్పట్లో సినిమా రావడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. జక్కన్న క్రేజ్ పరంగా ప్రస్తుతం అందనంత ఎత్తులో ఉన్నారనే సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి3 తెరకెక్కించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మొదటి సినిమా రిలీజ్ కాకుండానే సుహాస్ దర్శకుడిపై ఈ కాన్ఫిడెన్స్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus