టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్లలో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఒకటి. వంద సినిమాలు నిర్మించడమే టార్గెట్ గా పెట్టుకుని వరుసగా కథలు ఓకే చేస్తూ వచ్చింది ఈ సంస్థ. వేరే నిర్మాతలతో టై-అప్ అయ్యి చేసిన అన్ని సినిమాలు బాగా ఆడాయి. ‘ఓ బేబీ’ (Oh! Baby) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ‘ధమాకా’ (Dhamaka) వంటి బ్లాక్ బస్టర్స్ పీపుల్ మీడియా ఖాతాలో ఉన్నాయి. కానీ తర్వాత సోలోగా నిర్మించిన సినిమాలు అన్నీ నిరాశపరిచాయి.
2023, 2024..లలో ఈ బ్యానర్ నుండి వచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ‘మనమే’ (Manamey) ‘విశ్వం’ (Viswam) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు సాధించాయి. కానీ వాటికి పెట్టిన బడ్జెట్..కి న్యాయం చేసేలా అయితే కలెక్ట్ చేసింది లేదు. ఇక ఇంకో విషయం ఏంటంటే.. 2024 లో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మించిన సినిమాల లాస్..లను కనుక గమనిస్తే, వాటి లెక్క రూ.240 కోట్లు ఉంటుందని ఇన్సైడ్ టాక్.
‘ఈగల్’ (Eagle) సినిమాకు రూ.65 కోట్ల వరకు పెట్టారు. ‘విశ్వం’ కి రూ.40 కోట్లు, ‘శ్వాగ్’ (Swag) కి రూ.16 కోట్లు, ‘మనమే’ కి రూ.55 కోట్లు , ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) కి రూ.90 కోట్లు ఇలా ఖర్చు చేశారట. వీటిలో బిజినెస్..లు, రికవరీ..లు, వడ్డీలు వంటి వాటితో కలుపుకుని రూ.240 కోట్ల వరకు ఈ సంస్థకి నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.
ప్రభాస్ తో (Prabhas) చేస్తున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ..ల సినిమాలు కంప్లీట్ అవ్వాలి. వాటికి కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ ‘ది రాజాసాబ్’ బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలు తెస్తే తప్ప.. ఈ సంస్థ కోలుకునే అవకాశాలు లేవు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కూడా ఇదే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు మొన్నామధ్య ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.