Prabhas: ప్రభాస్ సినిమాల వల్ల పెరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్.. కానీ?

  • July 27, 2024 / 12:34 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) వరుస విజయాలు సాధించడం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మేలు చేస్తోంది. ప్రభాస్ సినిమాల వల్ల ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూసే పరిస్థితి నెలకొంది. దేవర (Devara) , పుష్ప2 (Pushpa 2) , గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ముందువరసలో ఉండటం కొసమెరుపు. పుష్ప2 సినిమా పుష్ప1 (Pushpa) కు సీక్వెల్ కాగా దేవర సైతం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ప్రభాస్ సినిమాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెరిగిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

ప్రభాస్ సినిమాలు 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు హీరోలకు మంచి పేరును నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. మంచి కంటెంట్ తో తెరకెక్కిస్తే ఎంత బడ్జెట్ తో అయినా రిస్క్ చేయవచ్చని ప్రభాస్ తన సినిమాలతో ప్రూవ్ చేస్తుండటం గమనార్హం.ప్రభాస్ సినిమాలు విడుదలైన ప్రతి సందర్భంలో థియేటర్లు కళకళలాడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రభాస్ త్వరలో క్రేజీ ప్రాజెక్ట్స్ ను ప్రకటించనుండగా ఆ ప్రాజెక్ట్స్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ బెల్ట్ లో ప్రభాస్ సినిమాలు అక్కడి స్ట్రెయిట్ హీరోల సినిమాలను మించి కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.

ప్రభాస్ రేంజ్ కు తగ్గ సినిమాలు పడితే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కలెక్షన్లతో మరిన్ని అద్భుతాలు చేస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ప్రభాస్ రాజమౌళి (Rajamouli) కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నా ఈ కాంబినేషన్ లో ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus