స్టార్ హీరో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి1, బాహుబలి2 పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. బాహుబలి2 తర్వాత ప్రభాస్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరగడంతో పాటు ప్రభాస్ తో సినిమాలను నిర్మించే నిర్మాతల సంఖ్య కూడా పెరిగింది. బాహుబలి ఫ్రాంఛైజీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరిగింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ప్రభాస్ కు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ప్రభాస్ తో సినిమా అంటే ఖర్చు విషయంలో నిర్మాతలు వెనుకాడటం లేదు. ప్రభాస్ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసిన ఆదిపురుష్ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా సైతం 500 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూడు సినిమాలు ఏకంగా 1200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఒక హీరోపై నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు చేయడం సాధారణ విషయం కాదు. అయితే ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండటంతో నిర్మాతలు సైతం ప్రభాస్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి సినిమాలను నిర్మిస్తున్నారు.
ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.