Prabhas: ప్రభాస్‌ వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు ఎందుకో?

ప్రభాస్‌ నెక్స్ట్‌ ఎంటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం ఈజీ కానీ, నెక్స్ట్‌ ఎన్ని సినిమాలు వరుసలో ఉన్నాయి అంటే మాత్రం సరైన సమాధానం చెప్పడం మాత్రం కష్టం. ఎందుకంటే అధికారికంగా లైన్‌లో ఉన్నవి నాలుగు సినిమాలు అయితే, వాటి తర్వాత చేసే సినిమాలు అంటూ మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ప్రభాస్‌ ఎన్ని సినిమాలు చేస్తాడు అని కొందరు. అసలు వరుసగా ఇన్ని సినిమాలు ఎందుకు ఓకే చేస్తున్నాడు అని ఇంకొందరు అంటున్నారు.

అసలు ప్రభాస్‌ నెక్స్ట్‌ సినిమాల గురించి ఎందుకు చర్చ వస్తోంది అంటే… లోకేశ్‌ కనగరాజ్‌తో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రభాస్‌కు లోకేశ్‌ సినిమా కథ పాయింట్‌ వినిపించాడట. దానికి డార్లింగ్ ఓకే కూడా చెప్పాడట. దీంతో కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి మరోసారి కలిసే పనిలో ఉన్నాడట లోకేశ్‌. దీంతో ఈ సినిమా మ్యాగ్జిమమ్‌ ఓకే అయినట్లే అని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ చేయాల్సిన ‘రాంబో’లో ప్రభాస్‌ ఎంటర్‌ అవుతున్నాడనీ వార్తలొస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే ప్రభాస్‌ వరుసగా ఇన్ని సినిమాలు ఎందుకు ఒప్పేసుకుంటున్నాడు అనే ప్రశ్న తప్పక వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ‘రాధే శ్యామ్’, ‘సలార్‌2, ‘ఆదిపురుష్‌’, నాగ్‌ అశ్విన్‌ సినిమా రూపంలో నాలుగు సినిమాలు సినిమాలున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు రెండు సినిమాలు ఓకే అంటున్నారు. లెక్క పెట్టి సినిమాలు చేసుకునే ఇలా వరుసగా ఎందుకు చేస్తున్నాడో అభిమానులకు కూడా అర్థం కావడం లేదట. కొందరైతే సినిమాల గ్యాప్‌ ఇస్తే… పెళ్లి మాట ఎత్తుతున్నారు కాబట్టే… ఇలా గ్యాప్‌ లేకుండా చూసుకుంటున్నాడేమో అని జోకులు కూడా వేస్తున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus