Prabhas Prashanth Neel: ప్రభాస్ ప్రశాంత్ మూవీలో విలన్ ఇతనా?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సలార్ సినిమాలో విలన్ గా మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నారని సమాచారం. ఫ్యామిలీ మేన్ సీజన్ 2 ద్వారా మనోజ్ భాజ్ పాయ్ పేరు మారుమ్రోగింది. మంచి ప్రతిభ ఉన్న నటుడిగా మనోజ్ భాజ్ పాయ్ పేరును సంపాదించుకున్నారు. మనోజ్ భాజ్ పాయ్ తెలుగులో గతంలో కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఈ యాక్టర్ ప్రతిభకు ఇప్పటివరకు మూడు జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించని మనోజ్ భాజ్ పాయ్ పాన్ ఇండియా మూవీలో నటుడిగా ఎంపిక కావడం గమనార్హం. సలార్ సినిమాలో మనోజ్ పాత్ర సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. 2022 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలో సలార్ సినిమాలో మనోజ్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

సలార్ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో మనోజ్ ఈ సినిమాలో నటిస్తే ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus