టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా సలార్ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ప్రభాస్ నటించిన 5 సినిమాలు నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించిన ఆరు సినిమాలలో ప్రభాస్ సినిమాలే 5 సినిమాలు కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీ మరో సినిమాగా ఉంది.
నార్త్ అమెరికాలో ప్రభాస్ కు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బాహుబలి, బాహుబలి2, సాహో, ఆదిపురుష్, సలార్ సినిమాలు నార్త్ అమెరికాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం. ప్రభాస్ ఖాతాలో రేర్ రికార్డులు చేరుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ రికార్డ్ ను ఇప్పట్లో మరో హీరో బ్రేక్ చేయలేరు.
ప్రభాస్ (Prabhas) భవిష్యత్తు సినిమాలు సైతం భారీ లెవెల్ లో తెరకెక్కుతుండగా ఆ సినిమాలు సైతం రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉండగా ఈ స్టార్ హీరో భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ వరుసగా సంచలన విజయాలను సొంతం చేసుకుంటూ ఇతర హీరోలకు సైతం షాకులిస్తున్నారు.
సలార్ సినిమా వీక్ డేస్ లో సైతం రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. కొన్ని చోట్ల సలార్ మూవీ బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సలార్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సలార్2 సినిమాపై అంచనాలు పెరిగాయి. సలార్2 మూవీ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.