Prabhas: సీటీమార్ మూవీ చూసిన ప్రభాస్.. కానీ?

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన సీటీమార్ సినిమా వినాయక చవితి పండుగ కానుకగా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన ఫ్రెండ్ గోపీచంద్ నటించిన సీటీమార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తనకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి బిగ్గెస్ట్ హిట్ సీటీమార్ అని ప్రభాస్ కామెంట్లు చేశారు.

సీటీమార్ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ కావాలని కోరుకుంటున్నానని ప్రభాస్ పేర్కొన్నారు. అయితే ప్రభాస్ సీటీమార్ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చాలా కాలం తర్వాత సీటీమార్ సినిమాతో దర్శకుడు సంపత్ నందికి, హీరో గోపీచంద్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ప్రభాస్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. గోపీచంద్ కు జోడీగా తమన్నా ఈ సినిమాలో నటించారు.

తొలిరోజే సీటీమార్ ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్టు తెలుస్తోంది. లౌక్యం తర్వాత సరైన హిట్ లేని గోపీచంద్ సీటీమార్ తర్వాత మరిన్ని విజయాలు సాధించేలా కథలను ఎంపిక చేసుకోవాలని గోపీచంద్ అభిమానులు కోరుకుంటున్నారు. బీ, సీ సెంటర్స్ లో సీటీమార్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus