టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకీ పెరుగుతూ పోవడమే తప్ప.. ఫ్లాప్స్ పడినా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు.. మినిమమ్ గ్యారంటీ, ఇతర భాషల్లోనూ విడుదల అవుతుంటాయి కాబట్టి పాస్ అయిపోతాయి డార్లింగ్ సినిమాలు.. ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇక ‘సలార్’, ‘ప్రాజెక్ట్ – K’, ‘స్పిరిట్’, ‘రాజా డీలక్స్’ (మారుతి సినిమా).. వేటికవే డిఫరెంట్ జానర్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్..
ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మాండమైన రికార్డ్స్ సెట్ చేయనున్నాయి.. అప్ డేట్ ఇచ్చిన ప్రతిసారీ ‘ఆదిపురుష్’ మీద అంచనాలు తగ్గించేస్తున్నాడు డైరెక్టర్ ఓం రౌత్.. దాంతో అందరి కన్నూ ‘సలార్’ పైనే ఉంది.. ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాక యావత్ ప్రపంచం చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు తిప్పేలా చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా ‘సలార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..
హాట్ బ్యూటీ శృతి హాసన్ ఫస్ట్ టైం ప్రభాస్ పక్కన నటిస్తుంది.. రాజ మన్నార్ గా జగపతి బాబు, అతని కొడుకు వరద రాజ మన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28 రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.. రీసెంట్ న్యూస్ ఏంటంటే.. మేకర్స్ ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ చేసేశారట.. అది కూడా భారీ రేటుకి.. పైగా ఇప్పటి వరకు హయ్యస్ట్ బిజినెస్ చేసిన ప్రెస్టీజీయస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ ని బీట్ చేయడం విశేషం..
ట్రిపులరా ఓవర్సీస్ రైట్స్ రూ. 67 కోట్లకు అమ్మారట.. ‘సలార్’ (Salaar) హక్కులు రూ. 70 కోట్ల భారీ ధర పలికాయట.. దీంతో ప్రభాస్ సినిమాదే పై చేయిగా నిలిచింది.. ఇక తర్వాత రాబోయే ‘ప్రాజెక్ట్ – K’ రైట్స్ అయితే రూ. 80 కోట్ల వరకు వెళ్తాయని.. ఇలా సినిమా సినిమాకి బిజినెస్ పరంగా ప్రతీ ఏరియాలోనూ నయా రికార్డులు నమోదు చేయడం డార్లింగ్‌కి మాత్రమే సాధ్యం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?