Prabhas: సలార్ మూవీ విషయంలో నిర్మాతల మాస్టర్ ప్లాన్.. ఏమైందంటే?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా శృతి హాసన్ పాత్రకు సంబంధించిన షూట్ పూర్తైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని బోగట్టా. ఈ సినిమా రిలీజైన తర్వాత మూడు వారాల పాటు ఏ పెద్ద సినిమా విడుదల కాకుండా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

సలార్ విషయంలో నిర్మాతలు వేసిన మాస్టర్ ప్లాన్ వల్ల ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ సైతం సలార్ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ మూవీతో తాను కోరుకున్న సక్సెస్ దక్కుతుందని ప్రభాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా

సలార్ సైతం అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే మూవీ ఇదేనని ఇండస్ట్రీలో వినిపిస్తుండటం గమనార్హం. సలార్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సలార్ తెరకెక్కింది. ప్రభాస్ ఈ సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీ అవుతుండగా ప్రభాస్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా ప్రభాస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus