సలార్ రిలీజ్ డేట్.. బాక్సాఫీస్ కోసమే!

రెబల్ స్టార్ ప్రభాస్ – KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆదివారం అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట సలార్ ను 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ డేట్ ను మహేష్ , పవన్ బుక్ చేసుకోవడం ప్రభాస్ వెనక్కి తగ్గాడు.

అలాగే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా కాస్త సమయం ఎక్కువగానే పడుతుందని చిత్ర యూనిట్ ఏప్రిల్ 14ను ఫిక్స్ చేసుకుంది. ఆ డేట్ ను ఎంచుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఏప్రిల్ 14 గురువారం రిలీజ్ మొదటి రోజు కాబట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ద్వారా ఓపెనింగ్స్ గట్టిగానే వస్తాయి. ఇక తరువాత రోజు గుడ్ ఫ్రైడే హాలిడే కాబట్టి మేజర్ ప్లస్ పాయింట్.

శని ఆదివారాల్లో కలెక్షన్స్ రావడం కామన్. సలార్ కు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మొదటి నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ రికార్డులు క్రియేట్ అవ్వడం కామన్. చూస్తుంటే ప్రభాస్ తప్పకుండా సలార్ సినిమాతో ఎదో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని తెలుస్తోంది. ఇక ఇప్పటికే 25% షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మిగతా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus