‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తరువాత నుండి అన్నీ కూడా పాన్ ఇండియన్ కథలనే ఎంచుకుంటున్నాడు ప్రభాస్. వందల కోట్ల రేంజ్ లో అతడి సినిమాల బిజినెస్ జరుగుతోంది. ‘బాహుబలి’ తరువాత విడుదలైన ‘సాహో’ సినిమా ప్లాప్ అయినప్పటికీ భారీ వసూళ్లను మాత్రం రాబట్టింది. బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలకు మార్కెట్ పెరిగింది. అక్కడ స్టార్ హీరోలకు ధీటుగా ప్రభాస్ కి క్రేజ్ ఏర్పడింది.
ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోన్న ప్రభాస్.. ఒక్కో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు యాభై కోట్లలోపే రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ ఎంత డిమాండ్ చేస్తున్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నారు నిర్మాతలు. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న తొలిహీరో ప్రభాస్ అనే చెప్పాలి.
ప్రస్తుతం ఈయన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సలార్’ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేస్తుండగా.. ‘ఆదిపురుష్’ సినిమాను 2022 ఆగస్టులో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. దాన్ని 2023లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.