Prabhas: మంగుళూరులోని శ్రీదుర్గా పరమేశ్వరి ఆలయంలో ప్రభాస్ పూజలు.. వీడియో వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సలార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్లను రాబట్టింది. అంతకు ముందు వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ‘సలార్’ తో కోలుకున్నాడు. అయితే దీనికి సీక్వెల్ గా ‘సలార్ పార్ట్ 2 : శౌర్యాంగ పర్వం’ కూడా రాబోతుంది. 2025 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల నిర్మాత విజయ్ కిరంగధూర్ తెలియజేశారు.

ఇక ‘సలార్’ టీం ఇటీవల సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. మరోపక్క ప్రభాస్ ఇటీవల కర్ణాటక వెళ్లినట్టు తెలుస్తుంది. ‘సలార్’ సీక్వెల్ స్టోరీ డిస్కషన్స్ అలాగే పార్ట్ 1 సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అతను కర్ణాటక వెళ్లినట్టు కొందరు భావిస్తున్నారు.

అయితే మంగుళూరులో అతను శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో (Prabhas) ప్రభాస్ ప్రత్యేక పూజలు జరిపించినట్టు తెలుస్తుంది. ప్రభాస్ కి చెల్లెల్లు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇలా పూజలు జరిపినట్టు తెలుస్తుంది. ప్రభాస్ పూజలు ఆచరిస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి చూసిన కొంత మంది నెటిజన్లు.. అనుష్క కూడా బెంగళూరు బ్యూటీనే కదా. ఆమె ఎక్కడ ఉంది? అంటూ చిలిపి కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రభాస్ – అనుష్క ..ల మధ్య గతంలో ప్రేమ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ జరుగుతుండటం గమనార్హం.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus