‘రాధేశ్యామ్’ రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుందా..?

  • February 9, 2021 / 02:30 PM IST

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ‘సాహో’ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ఫెయిల్యూర్ కి మ్యూజిక్ కూడా కారణమే. మొదట శంకర్-ఎహ్‌సాన్-లాయ్‌లను సంగీత దర్శకులుగా ఎంపిక చేసుకున్న నిర్మాతలు ఆ తరువాత వాళ్లని కాదని.. ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు జిబ్రాన్ కి అప్పగించారు. ఇది సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఏది సింక్ లో లేక కంగాళీ అయింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అతడే పాటలు, నేపథ్య సంగీతం అందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అన్ని పాటలకు సంబంధించిన వర్క్ జస్టిన్ చేయడం లేదట. నేపథ్య సంగీతం బాధ్యత కూడా అతడిది కాదని తెలుస్తోంది. బాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తోన్న మిథూన్ తో ఈ సినిమాకి వర్క్ చేయించుకుంటున్నట్లు సమాచారం.

జస్టిన్ మాత్రమే అయితే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ను మిథూన్ కి అప్పగించినట్లు తెలుస్తోంది. ‘సాహో’ విషయంలో ఇలా చేసి దెబ్బ తిన్నప్పటికీ మళ్లీ అదే తప్పుని రిపీట్ చేస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 14న సినిమా టీజర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూలై 30న సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus