Prabhas: ప్రభాస్ సినిమాకి సింగీతం శ్రీనివాస రావు ఏం చేస్తున్నారంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఏ చిన్న పిక్, అప్‌డేట్ వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది.. ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఆదిపురుష్’ షూట్ కంప్లీట్ చేసేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఉంది. దానితో పాటు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ – K’ కూడా ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ఇటీవల స్టార్ట్ చేసిన మారుతి సినిమాల సంగతి సరేసరి..

ఇదిలా ఉంటే డార్లింగ్ రీసెంట్‌గా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావుని కలిశారు.. పెద్దవాళ్లకు ప్రభాస్ ఇచ్చే మర్యాద గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. తన స్టార్ స్టేటస్ పక్కన పెట్టి.. వినయంగా చేతులు కట్టుకుని.. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకి ఫోజిచ్చాడు.. ఇంతకీ సింగీతం గారిని కలిసిన కారణం ఏంటంటే.. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ – K’ మూవీకి ఆయన స్క్రిప్ట్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సింగీతం అనుభవం, ప్రతిభ ప్లస్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూకీ సినిమా ‘పుష్పక విమానం’ నుండి.. ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ లాంటి ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు చేశారు.. వయసు 80 పై బడినా ఇప్పటి యువతరం కూడా ఆశ్చర్యపోయేలా ఉంటుంది సింగీతం ఎనర్జీ అండ్ ఐడియాలజీ.. ప్రభాస్, దీపికా పదుకోన్, లెజెండరీ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తప్పితే ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయాలేం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది టీమ్..

2023 సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’ వాయిదా పడింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28కి ‘సలార్’ షెడ్యూల్ అయిపోయింది.. మారుతి డైరెక్ట్ చేస్తున్నచిత్రాన్ని ఆరు నెలల్లోపే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్.. దాదాపు మరో రెండేళ్ల వరకు డార్లింగ్ డైరీ ఖాళీ లేదని అంటున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus