బాలకృష్ణకు ఆ విషయంలో ఎవరూ సాటిరారు : ప్రగ్యా జైస్వాల్

సింహా, లెజెండ్ సినిమాల తరువాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి దర్శకుడు బోయపాటి శ్రీను ప్రగ్యా జైస్వాల్ ను ఫైనల్ చేశారు. బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ నటిగా మంచి పేరు సంపాదించుకున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు.

బాలకృష్ణతో నటిస్తున్న సినిమాతోనైనా స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని ప్రగ్యా భావిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ గారితో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. షూటింగ్ సెట్ లో పాజిటివిటీని నెలకొల్పే విధంగా బాలకృష్ణ ఉంటారని.. బాలకృష్ణకు సినిమాపై ఉండే అభిరుచి విషయంలో ఎవరూ సాటిరారని ఆమె వెల్లడించారు. జయ జానకి నాయక సినిమా కోసం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించడంతో బోయపాటి శ్రీనుతో కలిసి పని చేయడం సులభంగా ఉందని ప్రగ్యా పేర్కొన్నారు.

బాలకృష్ణతో కలిసి నటిస్తున్న ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని ప్రగ్యా జైస్వాల్ తెలిపారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు మారిన తరువాత తాను నటిస్తున్న తొలి సినిమా ఇదేనని ప్రగ్యా చెప్పుకొచ్చారు. నటిగా తన కలలను సాకారం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus