డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి నాలుగు రోజులకే ఈ చిత్రం రూ.44 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. అఘోర పాత్రలో బాలయ్య నటవిశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో మాస్ ఆడియెన్స్ కు పూనకాలు తెప్పించాడు బాలయ్య. అయితే అఘోర పక్కన ఎలాగు హీరోయిన్ అవసరం లేదు. మరి ఫస్ట్ హాఫ్ లో కనిపించే చిన బాలయ్య పక్కన ఓ హీరోయిన్ అవసరం ఉంది.
నిజానికి ఆమె పాత్ర ఫస్ట్ హాఫ్ వరకే అది ఒకటి రెండు పాటల వరకే పరిమితం అయినప్పటికీ.. బాలయ్య అభిమానులని దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు బోయపాటి. కలెక్టర్ గా మురళీ కృష్ణ(చిన బాలయ్య) భార్యగా ఆమె బాగానే చేసింది. అయితే ఈ చిత్రానికి ఆమె మొదటి ఛాయిస్ కాదు. కొంతమంది హీరోయిన్లను సంప్రదించాక బోయపాటి ఈమెను ఫైనల్ చేసాడు.
ఈ చిత్రానికి ముందుగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్,పాయల్ రాజ్ పుత్, కేథరిన్ వంటి భామల్ని సంప్రదించాడట బోయపాటి. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి కాబట్టి పెద్ద హీరోయిన్ ను తీసుకోవాలని బోయపాటి పరితపించాడు. కానీ వాళ్ళంతా ఏవేవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేశారు. దాంతో ప్రగ్యా ఫైనల్ అయ్యింది.అయితే ‘అఖండ’ విజయం ఆమెకు కలిసొస్తుందా లేదా అంటే… డౌటే..!
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!