Prakash Raj: మా ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా: ప్రకాష్‌రాజ్

మరోసారి మా ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల ప్రచారం మొదలయినప్పటి నుంచి కొనసాగుతున్న గోల మళ్ళీ ఫలితాల అనంతరం కూడా కొనసాగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు అంతకంతకు పెరుగుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక మా ఎన్నికల్లో మా ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్‌ రాజ్ క్లారిటీ ఇచ్చేశారు. ‘మా’ సంక్షేమం కోసం.. మా ప్యానెల్‌ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నట్లు తెలియజేసిన ప్రకాష్ రాజ్ తన రాజీనామా గురించి మరోసారి స్పందించారు.

తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంటుంది అని మంచు విష్ణు హామీ ఇస్తేనే.. బై లాస్ మార్చమని చెబితేనే.. నా రాజీనామా వెనక్కి తీసుకుంటాను అని ప్రకాష్‌రాజ్ మరొక కండిషన్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ.. నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే అసలు సమస్య. నరేష్ తో పని చేయడం సెట్ అవ్వదు. మమ్మల్ని తప్పు చేశారు అని అనుకున్నా.. పరవాలేదు అని వివరణ ఇచ్చారు.

ఇక నటుడు బెనర్జీ కంటతడి పెడుతూ.. నరేష్ నన్ను ముఠా నాయకుడు అని అన్నారు. అయినా మౌనంగా ఉన్నాను.. నేను గెలిచినా సంతోషం లేదు అంటూ విచారణ వ్యక్తం చేశారు. ఇక ఈ నిర్ణయంతో మా వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. మరి ఈ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus