Prakash Raj: డబ్బు కోసం పిచ్చి సినిమాలు చేశాను!: ప్రకాష్ రాజ్

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన ఎలాంటి పాత్రలలో నటించిన ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఒక తండ్రి పాత్ర అయినా తాత పాత్ర అయినా లేదా విలన్ పాత్ర అయినా కూడా ప్రకాష్ రాజ్ ఆ పాత్రకు 100% న్యాయం చేస్తారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రకాష్ రాజ్ పలుసార్లు వివాదాలలో కూడా నిలుస్తూ ఉంటారు. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలకు సంబంధించినటువంటి విషయాల గురించి లేదా రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు దీంతో పెద్ద ఎత్తున వివాదాలలో కూడా నిలుస్తూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రకాష్ రాజ్ తన సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నేను ముందుగా సినిమాలకు ఎంపిక అయిన తర్వాతనే నన్ను తీసేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయని తెలిపారు. అలా సినిమాలలో నుంచి తీసేయడం వెనక పెద్ద ఎత్తున రాజకీయాలు జరిగాయన్న సంగతి నాకు తెలుసని అందుకే సినిమాల నుంచి నన్ను తొలగించినా పెద్దగా బాధపడనని తెలిపారు.

ఇకముందు నేను సినిమాలో నటిస్తున్నాను అంటే నాకు (Prakash Raj) సౌకర్యంగా ఉందా లేదా అనే విషయాల గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఇక కొన్ని సినిమాలలో నా నటన ఓవర్ యాక్టింగ్ లా ఉంటుందని చాలా మంది నాతో చెబుతూ ఉంటారు. నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను అంటూ నేను బాగా నటిస్తున్నాననే కదా అర్థం అంటూ ఈయన తెలియజేశారు. ఇక డబ్బు కోసం ఒకప్పుడు నేను నిన్ను పిచ్చి సినిమాలు కూడా చేశాను అంటూ ఈమె తెలిపారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus