Prakash Raj: వైరల్ అవుతున్న ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన ప్రకాష్ రాజ్ తాజాగా మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సినీ కెరీర్ పై రాజకీయ ప్రభావం పడుతోందని ప్రకాష్ రాజ్ అన్నారు. నేను ప్రస్తుతం పొలిటికల్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నానని ఆయన వెల్లడించారు. ఈ రీజన్ వల్ల కొంతమంది నాతో కలిసి పని చేయడానికి ఇష్టపడటం లేదని ఆయన పేర్కొన్నారు. నాతో కలిసి నటించవద్దని వాళ్లు చెప్పలేరని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

ఒకవేళ నాతో కలిసి నటించాల్సి వచ్చినా వాళ్లను యాక్సెప్ట్ చేయరేమోనని భయం పట్టుకుందని ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లను కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకాష్ రాజ్ అన్నారు. నా భయం మరొకరికి శక్తి కాకూడదని అనుకుంటానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే ఎలాంటి పరిణామాలు అయినా ధైర్యంగా ఎదుర్కొంటానని ఆయన వెల్లడించారు. వాటిని స్వీకరించడానికి నేనెప్పుడూ సిద్ధమేనని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

ఈ విషయాలకు సంబంధించి నేను కొంచెం కూడా విచారించడం లేదని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడుతున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. నేను నా స్వరాన్ని వినిపించని పక్షంలో మంచి నటుడిగా చనిపోతానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. చాలామంది నటులు మౌనంగా ఉన్నారని అయితే వాళ్లను నిందించాలని నేను అనుకోవడం లేదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

మాట్లాడటం వల్ల వచ్చే పరిణామాలను వాళ్లు తట్టుకోలేరని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ప్రకాష్ రాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అర్థం కావడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే ప్రకాష్ రాజ్ రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus