Prakash Raj Vs Manchu Vishnu: ప్రకాశ్‌రాజ్‌ X విష్ణు.. టాలీవుడ్‌కి పాకిన తిరుపతి లడ్డు వివాదం.. ఏమైందంటే?

తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు ఆందోళనకర పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు ఈ విషయంలో మండిపడుతున్నాయి. ఈ ఘటనపై సత్వర, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఈ విషయంలో టాలీవుడ్‌కి వచ్చింది. నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో చేసిన పోస్ట్‌, దానికి మంచు విష్ణు (Manchu Vishnu) రియాక్షనే దీనికి కారణం. మామూలుగా అయితే తిరుమల శ్రీవారి ప్రసాదానికి, టాలీవుడ్‌కి ఎలాంటి సంబంధం లేదు.

Prakash Raj Vs Manchu Vishnu

కానీ ఈ విషయంలో విమర్శలు – ప్రతి విమర్శలు కాదు.. నిజం త్వరగా తేల్చండి. ఇప్పటికే దేశంలో ఉన్న ఆందోళనకర పరిస్థితులు చాలు అని పవన్‌ కల్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశిస్తూ ప్రకాశ్‌ రాజ్‌ ఓ ట్వీట్‌ చేశారు. దానికి పవన్‌ ఏమంటారో తెలియదు కానీ.. మంచు విష్ణు మాత్రం రియాక్ట్‌ అయ్యారు. అదే ఆ వేడి ఇక్కడకు రావడానికి కారణమైంది. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి.

మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు. #జస్ట్‌ ఆస్కింగ్‌ అని ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) ఆ పోస్టులో రాసుకొచ్చారు. అయితే దీనికి విష్ణు రియాక్ట్‌ అవుతూ.. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నా లాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఇప్పటికే కోరారు. ఆయన ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు అని రియాక్ట్‌ అయ్యాడు విష్ణు. అక్కడితో ఆగకుండా ఇలాంటి వ్యవహారంలో మీ లాంటి వారు ఉంటే, విషయం ఏ రంగు పులుముకుంటుందో? అందుకే మీ పరిధుల్లో మీరు ఉండండి. అని రాసుకొచ్చాడు. ఇందులో కాస్త ఘాటు రియాక్షనే కనిపించింది.

అయితే దానికి ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) మరో రియాక్షన్‌ ఇచ్చాడు. ‘ఓకే శివయ్యా.. నా దృష్టి కోణం నాకుంది. అలాగే మీకు కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. #జస్ట్‌ ఆస్కింగ్‌ అని రాసుకొచ్చాడు. గత ‘మా’ ఎన్నికల సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటీలో నిలవడంతో.. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత తిరుమల లడ్డు విషయంలో ఇలా మాట్లాడుతున్నారు. అన్నట్లు త్వరలో ‘మా’ ఎన్నికలు ఉంటాయి.

వెంకీ – అనిల్‌ మూవీ సెట్‌లో బాలయ్య.. భలే ఉంది కదా ఫ్రేమ్‌.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus