Prakash Raj, Puri Jagannadh: పూరి హెల్ప్ తీసుకుంటున్న ప్రకాష్ రాజ్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. కానీ ఇప్పటినుండే టాలీవుడ్ ‘మా’ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. గడిచిన రెండు వారాల్లో ఎక్కడ చూసినా ‘మా’ హడావిడే కనిపించింది. కానీ ఇప్పుడు సద్దుమణిగింది. అయితే ఇదంతా బయటకు మాత్రమేనని తెలుస్తోంది. తెర వెనుక ఎవరి వ్యవహారాలు వాళ్లు నడిపిస్తున్నారు.

మంచు విష్ణు ప్యానెల్ ఇంకా రెడీ కాలేదు. ప్రముఖ తారలు ఈ ప్యానెల్ లో జాయిన్ అయినప్పటికీ విషయాలను మాత్రం బయటకు రానివ్వకుండా చూస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న నరేష్.. ఈ ప్యానెల్ కి సాయం చేస్తున్నారని సమాచారం. ఇక అందరికంటే ముందుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన ప్యానెల్ గురించి, తను చేయబోయే సేవల గురించి చెప్పిన ప్రకాష్ రాజ్.. పూరి జగన్నాథ్ ఆఫీసును తన రాజకీయాల కోసం వాడుతున్నట్లు సమాచారం.

పూరి ఆఫీస్ కేంద్రంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్యానెల్ లో కీలకమైన పలువురు వ్యక్తులు పూరి ఆఫీస్ కు వెళ్తూ అక్కడ నుండే వ్యూహారచన సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఏకగ్రీవం అనే ఆలోచనకు అవకాశం లేకుండా పోయింది. కానీ చిరంజీవి లాంటి పెద్దలు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలనైతే చూస్తున్నారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి అప్పటికి ఎంతమంది పోటీ చేస్తారో.. ఎంతమంది డ్రాప్ అవుతారో చూడాలి!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus