ప్రసాద్ ఐమాక్స్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్!

హైదరాబాద్ లో నివశించే సినిమా అభిమానులకు ప్రసాద్ ఐమాక్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే వాళ్లు సైతం ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూడాలని భావిస్తారు. ప్రసాద్ ఐమాక్స్ కు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ గా గుర్తింపు ఉంది. అయితే ప్రసాద్ ఐమాక్స్ పేరు ప్రసాద్ మల్టీప్లెక్స్ గా మారింది. ఇకపై ఐమాక్స్ ఫార్మాట్ లో సినిమాలను ప్రదర్శించరు కాబట్టి ప్రసాద్ ఐమాక్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ గా మారింది.

ఈ మార్పు వెనుక కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఐమాక్స్ ప్రొజెక్షన్ టెక్నాలజీని వినియోగించడం లేదు. ప్రస్తుతం ఎక్కువగా డిజిటల్ ఫార్మాట్ ప్రొజెక్షన్ ను వాడుతున్న నేపథ్యంలో ఐమాక్స్ ప్రొజెక్షన్ కు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంటెంట్ డెలివరీ విధానంలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ఐమాక్స్ ప్రొజెక్షన్ క్లిష్టంగా మారిందని సమాచారం. ఐమాక్స్ అనలాగ్ ప్రొజెక్టర్ సహాయంతో ఇప్పటివరకు సినిమాలను ప్రదర్శించగా ఆ విధానం సాధ్యం కాకపోవడంతో ఐమాక్స్ ను ఆపేశారని బోగట్టా.

అయితే ఐమాక్స్ స్క్రీన్ లేకున్నా లార్జ్ స్క్రీన్ల మీద కొత్త సినిమాల ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్ లో ఎన్నో మల్టీప్లెక్స్ లు అందుబాటులోకి వచ్చినా ప్రసాద్ ఐమాక్స్ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. ప్రసాద్ ఐమాక్స్ పేరు మారడం అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రసాద్ ఐమాక్స్ లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు ప్రదర్శితమయ్యేవి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల ప్రదర్శన అరుదుగా మాత్రమే జరిగేది. నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా ప్రసాద్ ఐమాక్స్ లో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపేవారు.

ప్రసాద్స్ లో ఐమాక్స్ ప్రొజెక్షన్ ను కొనసాగిస్తే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. డిజిటలేజేషన్స్ స్క్రీన్ ఐమాక్స్ ఫీల్ ను ఇవ్వదనే సంగతి తెలిసిందే. కాలం చెల్లిన ఐమాక్స్ ప్రొజెక్షన్ ను అదే పేరుతో పిలవడం చట్ట ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి పేరు మార్చినట్టు సమాచారం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus