Prasanna Vadanam Collections: సుహాస్ ‘ప్రసన్నవదనం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే..!
- May 10, 2024 / 03:18 PM ISTByFilmy Focus
సుహాస్ (Suhas) హీరోగా మారి ఇప్పటికే ‘కలర్ ఫోటో'(Colour Photo) ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బాండు’ (Ambajipeta Marriage Band) వంటి సినిమాలు చేశాడు. అన్నీ సక్సెస్ సాధించాయి. అందుకే అతని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) పై కూడా మంచి బజ్ ఏర్పడింది. సుకుమార్ (Sukumar) శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశి సింగ్ హీరోయిన్స్. మే 3న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.మొదటి వారం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని రాబట్టలేదు..! ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.55 cr |
| సీడెడ్ | 0.15 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.48 cr |
| ఏపీ + తెలంగాణ | 1.18 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.18 cr |
| ఓవర్సీస్ | 0.26 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 1.62 cr |
‘ప్రసన్నవదనం’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.62 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.












