ప్రశాంత్ వర్మ.. తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ‘అ!’ తో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ.. ఆ తర్వాత ‘కల్కి’ వంటి ప్లాప్ ఇచ్చాడు. అయితే అది కమర్షియల్ గా డిజప్పాయింట్ చేసినా.. కథ, కథనాలకు మంచి మార్కులే పడ్డాయి. టీవీల్లో, ఓటీటీల్లో ఆ సినిమాని బాగానే చూశారు. తర్వాత వచ్చిన ‘జాంబీ రెడ్డి’ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక 2024 సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత ‘జై హనుమాన్’ ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు ప్రశాంత్. అలాగే చాలా మంది స్టార్ హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేసుకోవాలని చూశాడు. ఓ దశలో రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్ అంటూ ప్రకటన వచ్చింది. కానీ ప్రశాంత్ వర్మ.. తీరు రణ్వీర్ సింగ్ కి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు కథనాలు వినిపించాయి. అందువల్ల ప్రశాంత్ వర్మ- రణ్వీర్ సింగ్ ప్రాజెక్టు ఆగిపోయింది.
ఆ కథ అలాగే ఉంది. దానిని చాలా మంది స్టార్ హీరోలకు ప్రశాంత్ వర్మ వినిపించినట్టు వార్తలు వచ్చాయి. ఫైనల్ గా ప్రభాస్ ఆ కథ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడిచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టీం అయితే.. దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చేసి హంగామా మొదలు పెట్టింది. కానీ ప్రభాస్ ఆలోచన వేరుగా ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ అయితే ప్రభాస్ కి నచ్చింది.
కానీ ప్రశాంత్.. ప్రభాస్ కి ఫైనల్ నెరేషన్ ఇవ్వలేదట. అయినప్పటికీ ప్రశాంత్ వర్మ అండ్ టీం మాత్రం ప్రభాస్ తో సినిమా గ్యారెంటీ అని ప్రచారం చేసేసుకుంటున్నాయి. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టేస్తాం’ అంటూ చెప్పాడు. అసలు ‘ఫైనల్ నెరేషన్ అవ్వకుండా ఎలా ప్రాజెక్టు ఓకే అయ్యింది’ అని ప్రభాస్ అండ్ టీం చెబుతున్నారు. పైగా ప్రభాస్ ‘ది రాజాసాబ్’ తో పాటు ‘ఫౌజి’ ‘సలార్ 2’ ‘కల్కి 2’ వంటి సినిమాలు కంప్లీట్ చేయాలి. అవి పూర్తవ్వడానికి ఇంకో 2 ఏళ్ళు టైం పట్టొచ్చు.