టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి డైరెక్టర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. రాజమౌళి తన డైరెక్షన్ లో నటించే హీరోలు తన సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించకూడదని షరతులు విధిస్తారనే సంగతి తెలిసిందే. హీరోల లుక్ రివీల్ కాకూడదని, వర్క్ కు ఆటంకం కలగకూడదని రాజమౌళి ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటారని చాలామంది భావిస్తారు. ఈ నిబంధన వల్లే ప్రభాస్ ఐదేళ్ల పాటు బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూజన్ సినిమాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.
అయితే ప్రశాంత్ నీల్ మాత్రం హీరోలకు ఈ తరహా నిబంధన విధించడం లేదు. ప్రభాస్ ఒకవైపు సలార్ సినిమాలో నటిస్తూనే మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రాజమౌళి కూడా ప్రశాంత్ నీల్ లా హీరోలకు అవకాశాలను ఇస్తే బాగుంటుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ జానర్ ఆ జానర్ అనే తేడాల్లేకుండా అన్ని జానర్లలో సినిమాలను తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ కూడా యాక్షన్ జానర్ కు పరిమితం కాకుండా అన్ని జానర్లలో సినిమాలను తెరకెక్కించాలని అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.
ప్రశాంత్ నీల్ ఈ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇద్దరు సౌత్ డైరెక్టర్లు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటుతుండటం గమనార్హం. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రాజమౌళి పై చేయి సాధిస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి తీసుకుంటున్న పారితోషికంతో పోల్చి చూస్తే ప్రశాంత్ నీల్ పారితోషికం తక్కువేనని తెలుస్తోంది.
ఈ ఇద్దరు డైరెక్టర్లు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుని సౌత్ సినిమాల ఖ్యాతిని మరింత పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.