Salaar: సలార్ విషయంలో ప్రశాంత్ షాకివ్వబోతున్నారా.. ఏమైందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ ఎంట్రీ కోసం 2 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. సలార్ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ కూడా ఆలస్యంగా ఉండనుందని సమాచారం అందుతోంది. సలార్ పార్ట్1 మొదలైన అరగంట వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ప్రభాస్ ను ఎలివేట్ చేస్తూ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. సలార్1 ట్రైలర్ కొంతమంది ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయినా ఎక్కువమంది ప్రేక్షకులకు మాత్రం నచ్చింది.

సలార్ విషయంలో ప్రశాంత్ షాకివ్వబోతున్నారని అయితే సినిమాకు అనుగుణంగా ఆ సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. సలార్ సినిమాలో శృతి హాసన్ పాత్రకు సైతం పెద్దగా ప్రాధాన్యత ఉండదని ఈ ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది. సలార్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. సలార్ సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభాలను సొంతం చేసుకోగా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

సలార్ లో (Salaar) ప్రభాస్ ఫ్రెండ్ షిప్ కోసం ప్రాణమైనా ఇచ్చే దేవా పాత్రలో కనిపించనున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో పాటు మరింత దగ్గరవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాలతో సైతం కెరీర్ బెస్ట్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రభాస్ ప్రాజెక్ట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇతర భాషల ప్రేక్షకులకు సైతం నచ్చే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus