సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన సినిమాలలో ఒకటైన హనుమాన్ మూవీ వీక్ డేస్ లో కూడా ఊహించని రేంజ్ లో బుకింగ్స్ తో అదరగొడుతోంది. సీడెడ్ లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో తేజ సజ్జా రోల్ పరిమితమని తెలుస్తోంది. హనుమాన్ సినిమాతో పోల్చి చూస్తే జై హనుమాన్ మరింత ప్రత్యేకంగా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. జై హనుమాన్ మూవీలో మరిన్ని పాత్రలు కనిపిస్తాయని ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేర్కొన్నారు. జై హనుమాన్ లో తేజ పాత్ర తక్కువగా ఉంటుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
తన సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం 20 కథలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి సంక్రాంతి పండుగకు ఒక మూవీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన కామెంట్లు చేశారు. 2025 సంక్రాంతికి జై హనుమాన్ మూవీ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.జై హనుమాన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
2025 సంవత్సరం సంక్రాంతికి గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి కానుకగా విశ్వంభర, శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమాలు ఫిక్స్ కాగా ఈ సినిమాలకు పోటీగా మరిన్ని సినిమాలు చేరే అవకాశం ఉంది. 2025 సంవత్సరం సంక్రాంతి పోటీ కూడా ఊహించని విధంగా ఉండబోతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.