సాధారణంగా కొత్త సినిమాలు ఎంటర్ అయితే అప్పటివరకూ ఉన్న సినిమాల కలెక్షన్లకి బ్రేక్ పడుతుంటుంది. కానీ ‘దర్బార్’ వంటి సూపర్ స్టార్ సినిమా విడుదలైనప్పటికీ.. సాయి తేజ్.. ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం. ‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేసాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్య రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రలు పోషించారు.
డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లను రాబడుతుండడం విశేషం. ఇక ఈ చిత్రం 3 వారాల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 12.22 cr |
సీడెడ్ | 3.88 cr |
ఉత్తరాంధ్ర | 4.73 cr |
ఈస్ట్ | 2.02 cr |
వెస్ట్ | 1.51 cr |
కృష్ణా | 2.05 cr |
గుంటూరు | 1.97 cr |
నెల్లూరు | 0.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.81 cr |
ఓవర్సీస్ | 2.58 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 33.68 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 3 వారాలు పూర్తయ్యేసరికి 33.68 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక నిన్న రజినీ ‘దర్బార్’ విడుదలైనప్పటికీ… ఈ చిత్రం 0.19 కోట్ల షేర్ ను రాబట్టింది.
Click Here to Read Prati Roju Pandage Movie Review
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!