మరో 72 గంటల్లో నాగ్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ప్రేక్షకుల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే టైటిల్ ను ఎందుకు ఫిక్స్ చేశారని చాలామంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు టాలెంటెడ్ డైరెక్టర్ కాగా కాగా ఈ డైరెక్టర్ గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.
సినిమాసినిమాకు దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం అని ఇంటెలిజెన్స్, రా ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ ఉందని తెలిపారు. ఈ సినిమాలో హీరో కోడ్ ఘోస్ట్ అని ప్రవీణ్ సత్తారు కామెంట్లు చేశారు. అండర్ వరల్డ్ అతనికి ఘోస్ట్ అనే పేరు పెట్టిందని ప్రవీణ్ సత్తారు టైటిల్ వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.
నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథను రాశానని ప్రవీణ్ సత్తారు తెలిపారు. ఈ సినిమాలో 12 యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని 40 ఏళ్ల ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ భిన్నమైన సినిమాలు అని బాగున్న ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి వరుణ్ తేజ్ తో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టునున్నానని ప్రవీణ్ సత్తారు అన్నారు.
యూకేలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని ప్రవీణ్ సత్తారు తెలిపారు. ది ఘోస్ట్ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉంటాయని హై ఎమోషన్స్ హీరోయిజం ఉన్న మూవీ ది ఘోస్ట్ అని ఆయన అన్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులు విజిల్స్ వేసే మూమెంట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల ది ఘోస్ట్ షెడ్యూల్స్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన కామెంట్లు చేశారు.